Sunday, December 22, 2024

మాల్దీవుల పట్టం చైనా అనుకూలుడైన ముయిజ్జుకే!

- Advertisement -
- Advertisement -

మాలె: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో చైనా అనుకూలుడైన అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్(పిఎన్ సి) భారీ మెజార్టీతో గెలుపొందింది. మొత్తం 93 స్థానాల్లో 70 సీట్లను గెలుచుకుంది. దీంతో ముయిజ్జు మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. భారత్ కు అనుకూలంగా ఉండే మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం ముహమ్మద్ సోలికి చెందిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ(ఎండిపి) 15 సీట్లకే పరిమితమైంది.

మాల్దీవుల్లో చిన్న ద్వీపాలు కలిపి దాదాపు 1192 ప్రాంతాలున్నాయి. ఇవన్నీ 800 కిమీ. విస్తరించి ఉంటాయి. ఈ ద్వీపాలు హిందూ మహాసముద్రంలో జియోపొలిటికల్ వేదికగా ఉన్నాయి. ముయిజ్జు పక్కా భారత వ్యతిరేకి. అయితే భారత్ ఆర్థిక సాయం లేకుండా మనజాలమని కాస్త తగ్గి ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News