- Advertisement -
మాల్దీవుల నుంచి భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినట్టు తెలుస్తోంది. 76 భారత మిలిటరీ సిబ్బందికి బదులు హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ సంస్థకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులను నియమించినట్టు మాల్దీవుల విదేశీ వ్యవహారాల మంత్రి మూసా జమీర్ శనివారం వెల్లడించారు. మే 10 నాటికి భారత బలగాలు వెనక్కి వెళ్లి పోవాలని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు కార్యాలయం గతంలో గడువు విధించిన సంగతి తెలిసిందే.
దాని ప్రకారం మార్చి 7 నుంచి 9 లోగా గాన్ నుంచి 26 మంది భారతీయ సైనికులు మాల్దీవుల నుంచి భారత్‌కు వెనక్కు వచ్చేశారు. మరో 25 మంది సైనికులు హనిమాధూ నుంచి ఏప్రిల్ 7,9 తేదీల మధ్య వెనక్కు వచ్చేశారు.కడ్‌ధూ నుంచి 12 మంది చివరి బ్యాచ్ తిరిగి వెనక్కు వచ్చేసింది. చివరి బ్యాచ్ 13 మంది సైనికులు కడ్‌దూ నుంచి గురువారం వచ్చేసిందని జమీర్ వెల్లడించారు.
- Advertisement -