Monday, December 23, 2024

బ్రాలు ధరించిన పురుష మోడల్స్: చైనాలో వినూత్న ప్రచారం

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: ఆన్‌లైన్‌లో అండర్‌గార్మెంట్స్‌కు విక్రయాలకు మహిళలు మోడలింగ్ చేయడంపై చైనా ప్రభుత్వం నిషేధం విధించడంతో గత్యంతరం లేక కంపెనీలు పురుషుల చేత బ్రాలు, ప్యాంటీలు, ఇతర మహిళా లోదుస్తులకు మోడలింగ్ చేయిస్తున్నాయి. పురుషుల మోడలింగ్ పట్ల ఆన్‌లైన్ కస్టమర్లు కూడా సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. అసభ్యకర లోదుస్తుల ప్రచారానికి పాల్పడి చట్టాలను అతిక్రమిస్తున్నారన్న కారణంపై అనేక కంపెనీలపై చైనా ప్రభుత్వం వేటువేసింది. ఆన్‌లైన్ బిజినెస్‌ను వదులుకోకూడదన్న ఉద్దేశంతో కంపెనీలు పురుష మోడల్స్‌తోనే మహిళల లోదుస్తులను ధరింపచేసి వీడియోల ద్వారా ప్రచారం సాగిస్తున్నాయి.

బ్రాలు, ప్యాంటీలు, సీ త్రూ నైట్ గౌన్లు వంటి, ఇతర లోదుస్తులు ధరింన పురుష మోడల్స్ ఆన్‌లైన్ ప్రచార వీడియోలలో దర్శనమిస్తున్నారు. తమకు మరో గత్యంతరం లేదని, మహిళా మోడల్స్ ధరించడం పట్ల అభ్యంతరం ఉన్న డిజైన్లను పురుష మోడల్స్ చేత వేయిస్తున్నామని ఒక అండర్‌గార్మెంట్స్ కంపెనీ యజమాని చెప్పినట్లు నైపోస్ట్.కాం వెల్లడించింది. చైనాలో లైవ్‌స్ట్రీమ్ షాపింగ్ ద్వారా 2023లో 700 బిలియన్ డాలర్లకు పైగా వ్యాపారం జరగనున్నట్లు అంచనా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News