రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో
విజయం సాధించిన నల్లగొండ
పిఆర్‌టియు అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి
కరీంనగర్‌లో బిజెపి మద్దతు పలికిన
కొమురయ్య గెలుపు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉపాధ్యాయ కోటా ఎంఎల్‌సి ఎన్నికల ఫలితాలు వెలువడ్డా యి. నల్గొండ -ఖమ్మం -వరంగల్ ఉపాధ్యాయ ఎంఎల్‌సిగా పింగిలి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్ -మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్ టీచర్ ఎంఎల్‌సిగా మల్కకొమురయ్య గెలుపొందారు. న ల్గొండలోని వేర్‌హౌసింగ్ గోదాములో జరిగిన కౌంటింగ్‌లో శ్రీపాల్ రెడ్డి తన ప్రత్యర్థులైన అలుగుబెల్లి నర్సిరెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డిపై విజయం సా ధించారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్
రాలేదు. దీంతో అధికారులు ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో సిట్టింగ్ ఎంఎల్‌సి నర్సిరెడ్డిపై శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో
24,139 మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ ప్రక్రియ రాత్రి 9 గంటలకు ముగిసింది. మొత్తం 25 కౌంటింగ్ నిర్వహించారు. అదేవిధంగా కరీంనగర్ -మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎంఎల్‌సిగా మల్క కొమురయ్య విజయం సాధించారు. కరీంనగర్‌లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ జరిగింది. ఈ నియోజకవర్గంలో 25,106 మంది ఓటు వేయగా బిజెపి మద్దతున్న కొమురయ్యకు 12,959 ఓట్లు వచ్చాయి. మరోవైపు కరీంనగర్ -మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం కౌంటింగ్ కొనసాగుతోంది. మంగళవారం వరకు ఫలితం రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.