Wednesday, April 2, 2025

అమృత్ భారత్ స్టేషన్ పథకం… మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు 70 శాతం పూర్తి

- Advertisement -
- Advertisement -

మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు 70 శాతం పూర్తి
దక్షిణమధ్య రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్ తనిఖీ
మన తెలంగాణ / హైదరాబాద్ : అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద సుమారు రూ. 27.61 కోట్ల వ్యయంతో చేపట్టిన మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. మల్కాజ్ గిరి రైల్వే స్టేషన్ లో జరుగుతున్న ఆధునీకరణ పనులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ శనివారం తనిఖీ చేశారు. ఈ తనఖీల్లో జిఎంతో పాటు హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్, ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు. ప్రయాణీకులకు ఆధునిక సౌకర్యాలను అందించడానికి చేపట్టిన ఆధునీకరణ పనులు వేగంగా చేపట్టి .ఈ సంవత్సరంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కొనసాగుతున్న ఆధునీకరణ పనులు, స్టేషన్ మూడు భాగం , 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ ఓబి ) నిర్మాణం, లిఫ్ట్‌లు , ఎస్కలేటర్ల ఏర్పాటు వంటి పనులను జిఎం సమీక్షించారు, వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్టాల్‌ను కూడా సందర్శించి, అక్కడ అమ్ముతున్న వివిధ ఉత్పత్తుల గురించి విక్రేతతో సంభాషించారు. ప్రయాణీకుల సజావుగా రాకపోకలు జరుపడానికి హైదరాబాద్ డివిజన్ అధికారులు చేపట్టిన సమగ్ర చర్యలను జిఎం సమీక్షించారు . స్టేషన్ లో గణనీయమైన మౌలిక సదుపాయాల మార్పులతో కూడిన ఆధునీకరణ పనుల దృష్ట్యా తగిన భద్రత, ప్రయాణీకులకు ఇబ్బందులు కల్గకుండా తగు చర్యలు చేపట్టాలని జిఎం అధికారులకు సూచించారు.

స్టేషన్ భవనం ముఖభాగానికి తగిన మార్పులు, ప్రవేశ ద్వారం ఏర్పాటు, ప్రయాణీకుల సౌలభ్యం కోసం 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ ఓబి ) నిర్మాణం, 3 లిఫ్టులు, 3 ఎస్కలేటర్లు ఏర్పాటు, ప్లాట్ ఫారమ్ ఉపరితల మెరుగుదల, అదనపు కవర్ ఏర్పాటు, ఇప్పటికే ఉన్న టాయిలెట్లకు మెరుగుదల, దివ్యాంగజన సౌకర్యాలతో సహా కొత్త టాయిలెట్ బ్లాక్‌ల నిర్మాణం, వెయిటింగ్ హాల్‌కు మెరుగుదల, సర్క్యులేటింగ్ ప్రాంతంలో ల్యాండ్‌స్కేపింగ్, సజావుగా ట్రాఫిక్ ప్రవాహానికి సర్క్యులేటింగ్ ఏరియా, స్టేషన్ ప్రాంతంలో కళ , సంస్కృతిని చిత్రీకరించడం, ప్రయాణీకులకు అనుకూలమైన సంకేతాలను అందించడం, రైలు సూచిక బోర్డులు, కోచ్ సూచిక బోర్డులు ఏర్పాటు పనులు జిఎం సమీక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News