Sunday, December 22, 2024

అమెరికాలో మల్కాజ్‌గిరి విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : అమెరికాలో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లిన విద్యార్థి అక్కడే ప్రాణాలు వదిలాడు. హైదరాబాద్ మల్కాజిగిరిలోని మారుతీనగర్ రోడ్డు నంబరు 8కు చెందిన రైల్వే ఉద్యోగి అశోక్ చిన్న కుమారుడు రేవంత్ ఎంఎస్ చేయడానికి అమెరికాలోని చికాగోకు వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి రూమ్‌లో ఉంటున్నాడు. గురువారం రాత్రి అందరూ కలిసి డిన్నర్‌కు వెళ్లొచ్చారు.

ఉదయం స్నేహితులు అతడిని నిద్ర లేపడానికి ప్రయత్నించారు. అతడు అచేతనంగా పడి ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. రేవంత్ స్నేహితులు ఈ చేదు వార్తను అతడి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తమ కుమారుడు మరణించడంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. తన కుమారుడి మృతదేహం హైదరాబాద్‌కు తీసుకురావాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. రేవంత్ వయసు 24 సంవత్సరాలు కాగా రెండు నెలల కిందే ఎంఎస్ చేసేందుకు షికాగో వెళ్లాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News