Monday, December 23, 2024

అభివృద్ధిలో ఆదర్శవంతంగా మల్కాజిగిరి

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి : మల్కాజిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని స్ధానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నా రు. ఆదివారం ఆయన, ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్‌తో కలిసి డివిజన్ పరిధిలోని పీవీఎన్ కాలనీ సాయిబాబా దేవాలయం రూ.20 లక్ష ల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సిసి రోడ్డు పనులకు శంకుస్ధాపన చేశారు.  డివిజన్ పరిధిలోని వివిధ కాలనీ లు, బస్తీలలో దెబ్బ తిన్న రోడ్లను గుర్తించి, అవసరమైన చోట సిసి రోడ్డు నిర్మాణం వేయిస్తున్నట్లు చెప్పారు.

ఆనంద్‌బాగ్ డివిజన్‌ను సమగ్రాభివృద్ధికి తనవంతు స హకారం అందచేస్తున్నట్లు తెలిపారు. కాలనీలు, బస్తీలలో ఎలాంటి సమస్యలు ఉ న్నా తన దృష్టికి తీసుకు వస్తే వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని ఆయన హమీనిచ్చారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, సా ధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే హన్మంతరావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీకాంత్, వర్క్ ఇన్‌స్పెక్టర్ రజనీకాంత్, బిఆర్‌ఎస్ అధికార ప్రతినిధి జీఎన్‌వీ సతీష్‌కుమార్, డివిజన్ అధ్యక్షుడు నోరి. సత్యమూర్తి, నాయకు లు బాబు, సత్యనారాయణ, సంపత్‌రావు, ఉమాపతి, బ్రహ్మయ్య, శంకర్ రావు, సంతోష్ రాందాసు, కన్నా, పోచయ్య, భాస్కర్, భిక్షపతి, రవి, వేముల శ్రీనివాస్, కిషోర్, శ్యామ్, రాధమ్మ, రాహుల్, కవిత, వైశాలి , కాలనీ పెద్దలు వేముల వెంకటేష్, సత్తిరెడ్డి, వెంకటేశ్వర్లు, బ్రహ్మ రెడ్డి, యాదగిరి రెడ్డి, కృష్ణ, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News