మల్కాజిగిరి: వచ్చే ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించి మరోమారు అవకాశం ఇస్తే మల్కాజిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నెంబర్‌వన్‌గా నిలుపుతానని స్ధానిక ఎమ్మెలే మైనంపల్లి హన్మంతరా వు అన్నారు. శుక్రవారం ఆనంద్‌బాగ్ డివిజన్ కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్‌తో కలిసి జవహర్‌నగర్‌లో రూ. 20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్ధాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనంద్‌బాగ్ డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలు, బస్తీలలో మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు సహకారం అందచేశానని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగాతన సహాయ సహకారాలు ఉంటాయన్నారు.
గతంలో తాను ఈ కాలనీలో పర్యటించిన సమయంలో స్థానికులు రోడ్డు సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని, దీనికి అవసరమైన నిధులను కేటాయించి, నేడు సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అంతకు ముందు డివిజన్ కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరా వు సహకారంతో ఆనంద్‌బాగ్ డివిజన్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పా రు. బస్తీలు, కాలనీలలో ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనకు త న వంతు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఈ లౌక్య, ఏఈ శ్రీకాంత్, వర్క్ ఇన్‌స్పెక్టర్ రజనీకాంత్, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకు డు బద్దం పరుశురాంరెడ్డి, మల్కాజిగిరి నియోజకవర్గం అధికార ప్రతినిధి జీఎన్‌వీ సతీష్‌కుమార్, సర్కిల్ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్, నియోజకవర్గం ఉపాధ్యక్షుడు పిట్ల నాగరాజు, ఆనంద్‌బాగ్ డివిజన్ అధ్యక్షుడు నోరి.సత్యమూర్తి, బాబు, సత్యనారాయణ, సంపత్‌రావు, ఉమాపతి, బ్రహ్మయ్య, సంతోష్ రాం దాస్, మల్లేష్‌గౌడ్, కిషోర్, నర్సింహరెడ్డి, గీతాగుప్తా, కవిత, వైశాలి తదితరులు పాల్గొన్నారు.