Monday, December 23, 2024

రాష్ట్రంలో మరో జలదృశ్యం ఆవిష్కృతం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నీటిపారుదల రంగంలో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో మరో జలదృశ్యం ఆవిష్కృతం అయింది. గోదావరి నదీజలాల ఆధారంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా మంగళవారం నాడు మల్కపేట రిజర్వాయర్‌లోకి నీటి ఎత్తిపోత ట్రయల్ రన్ విజయవంతం అయింది. రాజన్న సిరిసిల్ల జల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామం వద్ద తొమ్మిదవ ప్యాకేజిలో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న మూడు టిఎంసీల సామర్ధం ఉన్న మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ నిర్వహించారు. మధ్యమానేరు నుంచి రగుడు వరకూ , అక్కడి నుండి 12 కిలోమీటర్ల సొరంగమార్గం ద్వారా తరలించిన జలాలను మల్కపేట చేరువులోకి ఎత్తిపోసేప్రక్రియకు ట్రయల్ రన్ నిర్వహించారు. మల్కపేట నుంచి మైసమ్మ చెరువు ,గంభీరావు పేట మండలం సింగ సముద్రం నుంచి సెండవ దశ పంపుహౌజ్‌కు , బత్తుల చెరువు మీదుగా అప్పర్ మానేరుకు నీటిని తరలించేలా 32.4 కిలోమీటర్ల మేరకు పనులు చేపట్టారు.

గత ఏడాది వరదనీటిలో మల్కపేట పంపులు మునిగిపోయవటంతో తమిళనాడు నుంచి తీసుకువచ్చిన ప్రత్యేక మోటార్ల ద్వారా 45రోజుల పాటు నీటిని ఎత్తిపోశారు. ఆ తర్వాత మోటరల బిగింపు పనులు ప్రారంభించారు. రాష్ట్ర పురపాలక ఐటి శాఖల మంత్రి కేటిఆర్ ఆదేశాలమేరకు మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ చేపట్టేందకు అధికారులు గత రెండు వారాలుగా క్షేత్ర స్థాయిలో రేయింబవళ్లు కృషి చేస్తూ వచ్చారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పంప్‌హౌస్‌లో మోటార్లను ప్రారంభించి గోదావరి నదీజలాలను ఉదయం ఏడు గంటలకు మల్కపేట రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. ట్రయల్ రన్ పనులను ఈఎన్‌సీ ఎన్ వెంకటేశ్వర్లు ,ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, ఎంఆర్‌కేఈఆర్ , డబ్యూపిఎల్ కంపెనీల ప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షణ జరిపారు.

తొమ్మదవ ప్యాకేజి పనులను పర్యవేక్షిస్తున్న ఈఈ శ్రీనివాస్‌రెడ్డి ట్రయల్ రన్ సమన్వయ బాధ్యతలు చూశారు. మల్కపేట రిజర్వాయర్ నిర్మాణం వల్ల కొత్తగా 60వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది . అంతే కాకుండా మరో 26,150ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు నోచుకోనుంది. మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంతో వేములవాడ , సిరిసిల్ల నియోజకవర్గాల పరిధిలోని రైతాంగానికి సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించినట్టయింది. సుమారు రూ.504కోట్లు వ్యయం చేసినిర్మించిన మల్లపేట రిజర్వాయర్‌ను త్వరలోనే అధికారికంగా ప్రారంభించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News