Wednesday, January 22, 2025

బిజెపి, కాంగ్రెస్ తెలంగాణకు ఏం చేసింది: మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి, కాంగ్రెస్ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని మంత్రి మల్లారెడ్డి నిలదీశారు. ఆదివారం మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. తెచ్చుకున్న తెలంగాణ బాగు చేసుకున్నామని అందుకే దశాబ్ధి ఉత్సవాలు చేసుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందని మల్లారెడ్డి ప్రశ్నించారు. ఓట్ల కోసం బిజెపి రెండో రాజధాని అంశం తెరమీదకు తీసుకొస్తుందని దుయ్యబట్టారు. బిజెపి 3, కాంగ్రెస్‌కు 6 స్థానాలకు మించి రావాలని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా బిజెపి, కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రాదన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాత పేపర్లు తీసుకొచ్చి కొత్త ప్రజెంటేషన్ ఇస్తున్నారని దుయ్యబట్టారు. కిషన్ రెడ్డిని ప్రజలు ఎవరు నమ్మరన్నారు.

Also Read: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు.. నాగర్ కర్నూల్ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News