- Advertisement -
హైదరాబాద్: మునుగోడు అభివృద్ధి టిఆర్‌ఎస్‌తోనే సాధ్యమని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో మల్లారెడ్డి చివరి రోజు ప్రచారం నిర్వహించారు. బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి డబ్బులపై ఉన్న ధ్యాస మునుగోడు అభివృద్ధి లేదని చురకలంటించారు. బిజెపి ఓటమి ఖరారు కావడంతో రాజగోపాల్ రెడ్డి గొడవలకు తెరలేపాడని దుయ్యబట్టారు. మునుగోడులో టిఆర్‌ఎస్‌దే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు.
- Advertisement -