Monday, January 20, 2025

మనుమరాలి పెళ్లికి రావాలని సిఎం రేవంత్ కు మల్లారెడ్డి ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కలిశారు. బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని సిఎం నివాసానికి తన అల్లుడు, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితోపాటు మల్లారెడ్డి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డిని శాలువ కప్పి సత్కరించారు. తన మనుమరాలు పెళ్లికి రావాలని ఇద్దరు సిఎంను ఆహ్వానించారు. ఆయన వివాహ పత్రికను అందజేశారు. ఇక, రెండు రోజుల క్రితం ఎపి సిఎం చంద్రబాబు నాయుడిని కూడా కలిసి పెళ్లికి ఆహ్వానించిన సంగతి తెలిసందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News