హైదరాబాద్: పట్టణ ప్రగతిలో భాగంగా ఉప్పల్ నియోజక వర్గంలో పలు అభివృద్ది పనులకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డిలతో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… పట్టణ ప్రగతి దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జిహెచ్‌ఎంసి చుట్టూ ఉన్న మున్సిపాలిటీ లలో భారీ వర్షాలు కురిసి పెద్ద వరదలు వచ్చినా తట్టుకునే విధంగా సుమారు రూ.1000 కోట్ల రూపాయలతో డ్రెయిన్ల పునరుద్దరణ, బాక్స్ కల్వర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. నగరంలో చేపట్టిన పట్టణ ప్రగతి.. ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో విజవంతంగా కొనసాగుతోందన్నారు. చిలుకా నగర్ లో వైకుంఠదామం డిజైన్ పూరైనందున త్వరలో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. చిలుకా నగర్‌లో రూ. 4.34కోట్ల పనులకు శంకుస్థాపన చేశామని ఈ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శాసన సభ్యులు భేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 14 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన మేయర్, మంత్రి చేసినట్లు ఈ ప్రాంతంలో వరద వలన ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు డ్రెయిన్ ల పునరుద్దరణ, మరమ్మత్తుల పనులు సిసి రోడ్లు సకాలంలో పనులు పూర్తి చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.
Malla Reddy lays stone for Development works in Uppal