Monday, December 23, 2024

కాంగ్రెస్ సీనియర్లు… ఎవరి లాభం కోసం పని చేస్తున్నారు: మల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఎవరి లాభం కోసం చేస్తున్నారు: కాంగ్రెస్ సీనియర్లపై మల్ రెడ్డి రంగారెడ్డి ఆగ్రహం

తప్పు ఎవరూ చేసినా తప్పేనని మాజీ ఎంఎల్‌ఎ మల్ రెడ్డి రంగారెడ్డి చెప్పారు .పిసిసి కమిటీల్లో న్యాయం జరగకపోతే పార్టీ అధిష్టానం ముందు ఈ విషయమై చర్చించాలని ఆయన కోరారు. కానీ కమిటీల విషయమై బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే పార్టీకి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పారు. ఆదివారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పిసిసి కమిటీల్లో తప్పులు జరిగితే పార్టీ అధిష్టానంపై చర్చించాలన్నారు. ఎవరిపై కోపంతో పార్టీకి నష్టం చేస్తున్నారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు సూచించారు. పిసిసి కమిటీల్లో అన్యాయం జరిగితే రేవంత్ రెడ్డితో పాటు మీరు అధిష్టానం ముందు కూర్చుని చర్చించాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ల మాటలతో క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా బాధపడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి వచ్చేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. కాంగ్రెస్ సీనియర్ల నేతల తీరుతో పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. బిఆర్‌ఎస్, బిజెపికి లాభం చేకూర్చేలా సీనియర్ల వ్యవహరం ఉందన్నారు. గత ఎన్ని కల్లో టికెట్ కేటాయింపులో అవకతవకలు జరిగాయన్నారు. గెలిచే సీట్లను ఇతరులకు కేటాయించారని మల్ రెడ్డి రంగారెడ్డి విమర్శించారు. తన నియోజకవర్గంలో సగం స్థానిక సంస్థలను కైవసం చేసుకున్నట్టుగా ఆయన చెప్పారు. కానీ సీనియర్లుగా చెప్పుకుంటున్న నేతలు తమ నియోజకవర్గాల్లో ఎన్ని స్థానిక సంస్థలను గెలుచుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సీనియర్లు బుద్ది మార్చుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News