Monday, January 20, 2025

భూ వివాదంలో మల్లారెడ్డి వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

నగరంలోని పేట్ బషీర్‌బాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని సుచిత్రలో సర్వే నంబరు 82కు సంబంధించిన రెండున్నర ఎకరాల భూమి మాదంటే మాదని మాజీ మంత్రి మల్లారెడ్డి, అవతలి వర్గం వారు వాదిస్తున్నారు. తమ భూమిలో అక్రమంగా ఫెన్సింగ్ వేశారం టూ మల్లారెడ్డి అనుచరులు కంచెను కూల్చడం ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులతో ఉద్రిక్తతలకు దారి తీయగా రంగంలోకి దిగిన అధికారులు సర్వే నంబరు 82 భూమిలో సర్వే చేపట్టారు. బందోబస్తు మధ్య యంత్రాంగం సరిహద్దులు గుర్తించే పనిలో పడ్డారు. సర్వే నంబరు 82లో ఉన్న భూమి మొత్తం తమదేనని మాజీ మంత్రి మల్లారెడ్డి చెబుతున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ భూమిని 15 ఏళ్లు క్రితం కొనుగోలు చేశామన్నారు. ఈ భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని అన్నారు. అలాగే ఎప్పటికప్పుడు ట్యాక్స్‌లు కడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తనపట్ల వివక్ష చూపుతుందని తెలిపారు.

ఎంఎల్‌ఎ అయిన తనకే భద్రత లేకపోతే సామాన్యులకు ఏం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమది తప్పుంటే ఆ భూమిని వాళ్లనే తీసుకోమని మాజీ మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. ఇదే అంశంపై ప్రభుత్వ విప్, ధర్మపురి ఎంఎల్‌ఎ అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. తనతో పాటు ఆరుగురు కలిసి సుధామ నుంచి 2015లో సదరు భూమి కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిని కలిసి భూ వివాదాన్ని సెటిల్ చేయాలని అడగ్గా వారు కనీసం స్పందించలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. తన నిజాయతీని ముఖ్యమంత్రి వద్ద నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ‘నా అంత ధర్మాత్ముడు ఎవరూ లేరు. నీతిమంతుడు ఎవరూ లేరు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అని మాజీ మంత్రి మల్లారెడ్డి చెబుతారు. మేడ్చల్ కోర్టులో 2016లో ఇంజెక్షన్ ఆర్డర్ వేశాము. మా భూమిపైకి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు వచ్చి దౌర్జర్యం చేస్తున్నారని వేశాం. మాజీ మంత్రికి వచ్చిన రెండు వేల ఎకరాల భూమి ఎలా వచ్చిందో ప్రభుత్వానికి తెలపాల’ని ధర్మపురి ఎంఎల్‌ఎఅడ్లూరి లక్ష్మణ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News