Sunday, December 22, 2024

యు-టర్న్ తీసుకున్న మల్లా రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ పెళ్లిలో శుక్రవారం ఈటెల రాజేందర్ ను కలిసిన ఎంఎల్ఏ మల్లా రెడ్డి, ‘తప్పక గెలుస్తావ్’ అన్నారు. కానీ నేడు(శనివారం) ఎందుకో ఏమో యు-టర్న్ తీసుకుని నేనలా అనలేదంటున్నారు. ఆయన బిఆర్ఎస్ రాగిడి లక్ష్మా రెడ్డితో  కలిసి మీడియా వ్యక్తులతో మాట్లాడారు. ‘‘దయచేసి నేను చెప్పేది వినండి, నిన్న మధ్యాహ్నం 2.30 గంటలకు నేను ఒక వివాహానికి హాజరయ్యాను. నా పాత మిత్రుడు (ఈటెల రాజేందర్) చాలా రోజుల తర్వాత కలిశాడు. మేము ఒకరినొకరం ఆలింగనం చేసుకున్నాం’’ అన్నారు.

మీడియాకు చెందిన వారు ఆయన ప్రకటనపై అడిగేందుకు ప్రయత్నించగా, ‘‘ ఎవరిదైనా పుట్టిన రోజు ఉంటే మనం తప్పక శుభాకాంక్షలు చెబుతాం. దేవుని దీవెన కలగాలని కోరుకుంటాం. అలాగే నేను రాజేందర్ పుట్టిన రోజున దైవాశీస్సులు ఉండుగాక అన్నాను. ఆయన మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్నందున విజయోత్సు అన్నాను’’ అంటూ వివరించారు. శుభాకాంక్షలు చెప్పడంలో తప్పేమిటి? అని మల్లా రెడ్డి మీడియా వ్యక్తులను ప్రశ్నించారు. ‘‘నాకు ఎదురుపడిన వ్యక్తిని పలుకరించడం వెనుక ఏదో హిడెన్ అజెండా ఉందనడం ఏమిటి?’’ అని మల్లా రెడ్డి ప్రశ్నించారు.

‘‘ 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగేప్పుడు నేను కాంగ్రెస్ అభ్యర్థి టి. వజ్రేశ్ యాదవ్ గెలుస్తాడని అన్నాను. ఆయన గెలిచాడా?…బిజెపి గెలువదు. వారు మోసగాళ్లు. వారు వీడియోను వైరల్ చేస్తారంతే. మనస్సు, ప్రవర్తన బాగుండాలి’’ అని కూడా మల్లా రెడ్డి అన్నారు.

Malla Reddy 2

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News