Thursday, January 23, 2025

రజనీకాంత్‌తో పొగిడించుకున్న… బాబు వెన్నుపోటుదారుడే: మల్లాది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రజనీకాంత్‌తో పొగిడించుకున్నంత మాత్రాన మాజీ ముఖ్యమ్రంతి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు కాకపోరని వైసిపి ఎంఎల్‌ఎ మల్లాది విష్ణు చురకలంటించారు. గ్రాఫిక్ మాటలు మాట్లాడే చంద్రబాబును ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఘోర ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రిని ఎన్‌టిఆర్‌ను గతంలో చంద్రబాబు నాయుడు కించపర్చలేదా? అని ప్రశ్నించారు. ఎన్‌టిఆర్‌ను వెన్నుపోటు పొడిచి టిడిపిని చంద్రబాబు లాక్కున్న సంఘటన అందరికి గుర్తు ఉందని మల్లాది తెలిపారు. అప్పుడు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు విగ్రహం ముందు బాబు ఎందుకు జపం చేస్తున్నారని మల్లాది అడిగారు. ఎన్‌ఆర్‌కు వ్యక్తిత్వం లేదని, పరిపాలన చేతకాదని బాబు గతంలో విమర్శించలేదా? అని ప్రశ్నించారు.

Also Read: అర్ధరాత్రి హనుమకొండలో మహిళపై సామూహిక అత్యాచారం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News