Wednesday, January 22, 2025

ప్రత్యేక హోదాను ప్యాకేజీ కింద మార్చింది ఎవరు బాబు: మల్లాది

- Advertisement -
- Advertisement -

అమరావతి: జనసేన, టిడిపి ప్రజాస్వామ్యం లేని పార్టీలు అని వైసిపి ఎంఎల్‌ఎ మల్లాది విష్ణు విమర్శలు గుప్పించారు. శనివారం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అని మండిపడ్డారు. సిఎం జగన్ మోహన్ రెడ్డికి ఉన్న గ్రాఫ్‌ను తగ్గించే శక్తి మీకుందా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాను ప్యాకేజీ కింద మార్చింది చంద్రబాబు కాదా? అని నిలదీశారు. ప్రత్యేక హోదాకు సమాధి కట్టింది చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ సమస్యను చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారని మల్లాది దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్ట్‌లో అవినీతికి పాల్పడిందని చంద్రబాబు కాదా? అని అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News