Sunday, January 19, 2025

మల్లన్న సాగర్ కాలువలకు కెసిఆర్ పేరు పెట్టాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / కొండపాక : ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో దేశంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతసిండే. నర్సాపూర్ ఎమ్మెల్యే మధన్‌రెడ్డి , ఇరిగేషన్ అదికారులు, బాన్సువాడ ప్రజాప్రతినిధులతో కలిసి తిప్పారం శివారులోని మల్లన్న సాగర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మల్లన్న సాగర్ కట్ట వద్ద విలేకరులతో మాట్లాడుతూ రైతుల కష్టాలు తీర్చిన కనబడే దేవుడు సీఎం కేసీఆర్ అన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వృదాగా వెలుతున్న నీటిని వినియోగంలోకి తేవడం పెట్టుకొని వృదాగా వెలుతున్న నీటిని వినియోగంలోకి తేవడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేసి పట్టుదలతో సాదించి ప్రజల అవసరాలు తీర్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అన్నారు. సుమారు 1700 క్యూసెక్కుల సముద్రంలో కలిసే నీటిని ప్రజల అవసరాల కోసం ఎన్నో ఇబ్బందులను అదిగమించి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాడన్నారు.

సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టుల ద్వారా అనంతసాగర్ , రంగనాయకసాగర్ రిజర్వాయర్ల నుంచి అతి పెద్దగా 50 టీఎంసీ సామర్థంతో నిర్మించిన మల్లన్న సాగర్‌లోకి గోదావరి నీటిని గొప్ప విషయం అన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 50 లక్షల ఎకరాలకు ప్రత్యక్ష పరోక్ష సాగునీరు అందుతుందన్నారు. 31 నియోజక వర్గాలు, 13 జిల్లాల్లో రెండు పంటలకు నీరు అందుతుందన్నారు. ఇదంతా సీఎం సంకల్పం ఆయన కృషి పట్టుదల ఇంజనీర్ శ్రమతో రిజర్వాయర్ ఏర్పాటు అయిందన్నారు. ఎంతో మంది భూములు కోల్పోయిన వారికి ఆయన ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. మల్లన్న సాగర్ నుంచి నిజాం సాగర్ గోదావరి జలాలను అందించే కాలువలను పరిశీలించినట్లు తెలిపారు. నిజాం సాగర్‌కు వచ్చే నీటి ద్వారా నర్పాపూర్ , కౌడిపల్లి, జుక్కల్ బోదన్, బాన్సువాడ నియోజక వర్గ గ్రామాలకు రెండు పంటల సాగునీరు అందుతుందన్నారు. రాష్ట్రంలో సుమారు 150 నుంచి 200 టీఎంసీల నీరు ఉండే రిజర్వాయర్లు ఉన్నాయని ఒక సంవత్సరం వర్షం పడకున్నా రిజర్వాయర్ల ద్వారా పంటలు వేయవచ్చన్నారు.

ఎన్ని ఆటంకాలు పెట్టినా ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన అసాద్యాన్ని సుసాద్యం చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజల కష్టాలు తీర్చుతున్న కనబడే దేవుడు సీఎం కేసీఆర్ అని తెలిపారు. అన్నింటికి మూలం నీరు అని మీరు సమృద్దిగా ఉంటే రాష్ట్రం దేశం సంపదలతో తులతూగుతుందన్నారు. దేశంలో వృదాగా సముద్రంలో కలుస్తున్న నీటిని వినియోగంలోకి తీసుకువస్తే సస్యశ్యామలమవుతుందన్నారు. దీంతో నిరుద్యోగం పోతుందని కరువు పోయి సంపదతో తులతూగుతుందన్నారు. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు వెళ్లే కాలువకు కేసీఆర్ ఒకటి మల్లన్న సాగర్ నుంచి నిజాం సాగర్‌కు వెళ్లే కాల్వకు కేసీఆర్ రెండవ కాలుగా ఆయన నామకరణం చేశారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లో మిగతా పనులను తొందరగా చేయాలని అధికారులను అదేశించారు.

స్పీకర్‌కు పలువురు నాయకుల స్వాగతం

మల్లన్న సాగర్ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, స్ధానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎలక్షన్ రెడ్డి, రైతుబంధు సమితి స్టేట్ కౌన్సిల్ సభ్యుడు దేవి రవీందర్, పీఎసీఎస్ వైస్ చైర్మన్ అమరేందర్, పీఎన్‌ఆర్ సంస్థ చైర్మన్ పోల్కంపల్లి నరేందర్, సర్పంచ్‌లు మహిపాల్, కిరణ్‌కుమార్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును సందర్శనకు వచ్చిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు గౌరవ వందనం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News