Monday, December 23, 2024

హరీష్ రావుతో మల్లన్న సాగర్ ముంపు బాధితులు భేటీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ: హైదరాబాద్ లోని తన నివాసంలో ఎర్రబెల్లి గ్రామానికి చెందిన ముంపు బాధితులు మంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యారు. అయిన మల్లన్న సాగర్ ముంపు గ్రామం ఎర్రవెల్లి గ్రామ ప్రజలు మల్లన్న సాగర్ లో సర్వస్వం కోల్పోయామని, మల్లన్న సాగర్ నిర్మాణం కోసం మొదటి నుంచి సహకరించామని మంత్రికి మరోసారి గుర్తుచేశారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి లేఖను మంత్రికి గ్రామస్తులు అందించారు. గ్రామస్తుల విజ్ఞప్తి పై సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్ రావు వెంటనే జిల్లా కలెక్టర్ కు, అధికారులతో ఫోన్ లో మాట్లాడి పెండింగ్ అంశాలను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే మల్లన్న సాగర్ ముంపు గ్రామాలైన ఎర్రవెల్లి, మిగతా ఊర్లలో పట్టాలు స్వయంగా తానే పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందవద్దని అందరికి పూర్తిస్థాయి న్యాయం ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో చేస్తామని మంత్రి హరీష్ రావు ధైర్యం చెప్పారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News