Thursday, December 19, 2024

మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో భవనం పైనుంచి దూకిన విద్యార్థి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థి పురుగులు మందు తాగి అనంతరం భవనం పైనుంచి కిందకు దూకాడు. బుధవారం మధ్యాహ్నం మూడో సంవత్సరం చదివే హరినాథ్ అనే విద్యార్థి పురుగుల మందు తాగి తరువాత వసతి గృహం మూడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. హాస్టల్ బిల్డింగ్ మీది నుంచి దూకుతుండగా విద్యుత్ వైర్లు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News