- Advertisement -
బిజెపి పాలిస్తున్న రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న గ్రామంలాగా బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలలో ఒక్క గ్రామమైనా ఉందా అని మంత్రి మల్లారెడ్డి వాపోయారు. మంత్రి మల్లారెడ్డి బండి సంజయ్‌కు సవాల్ విసిరారు… తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మీ రాష్ట్రాలలో చేసే మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు రైతుకు న్యాయం జరగలేదని, అప్పుడు పంటకు కనీస గిట్టుబాటు ధర కూడా ఉండేది కాదని ఆయన విమర్శించారు. సిం కెసిఆర్ రైతును రాజుగా చేశారని , పంట పెట్టుబడి 10 వేలు, భీమా రూ.5లక్షలు ఇస్తున్నారని పేర్కొన్నారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో 12,700 గ్రామాలను అభివృద్ధి చేశారని తెలిపారు. ఉత్తమ గ్రామపంచాయతీలో 20 గ్రామాలకు 19 గ్రామాలు తెలంగాణ రాష్ట్రానివే అని అన్నారు.
- Advertisement -