Monday, December 23, 2024

పదవులు కెసిఆర్, కెటిఆర్ ఇస్తారు… నేను కాదు : మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. మేడ్చల్‌లో ఉన్న బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు మల్లారెడ్డి రికౌంటర్ ఇచ్చారు.  ఇది తమ ఇంటి సమస్య అని తమ ఇంటి సమస్యను తామే పరిష్కరించుకుంటామని మంత్రి తెలిపారు. తాను ఎవరితో విబేధాలు పెట్టుకునే వ్యక్తిని కాదని, తానే స్వయంగా ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడుతానని ఆయన అన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను అందరిని తన ఇంటికే ఆహ్వానిస్తానని తెలిపారు. ఈ సమస్యను పెద్దదిగా చేయొద్దని అన్నారు. పదవులు సిఎం కెసిఆర్, కెటిఆర్ ఇస్తారని తను కాదని తెలిపారు. మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డి తన అనుయాయులకే పదవులను కట్టబెడుతుండడంతో జిల్లాకు చెందిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సిఎం కెసిఆర్, కెటిఆర్ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News