Monday, December 23, 2024

నా కుటుంబంలో మూడు పదవులు ఉండాలనుకున్నా: మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మాజీ సిఎం కెసిఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్లుగానే తమ కుటుంబం నుంచీ మూడు పదవులు ఉండాలని భావించామని కార్మిక శాఖ మాజీ మంత్రి, మేడ్చల్ ఎంఎల్‌ఏ చేమకూర మల్లారెడ్డి అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తన కొడుకు భద్రారెడ్డి మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ఆదేశిస్తే పోటీ చేయడానికీ తన తనయుడు సిద్ధమే అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలోని మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపి టిక్కెట్ కోసం జగ్గారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫోకస్ కావడం కోసమే జగ్గారెడ్డి తన పేరును ఎత్తుకుంటున్నారని విమర్శించారు. తన పేరును తీయకుంటే జగ్గారెడ్డిని తెలంగాణలో ఎవరూ పట్టించుకోరని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News