Wednesday, January 22, 2025

మేడ్చల్‌లో మల్లారెడ్డి విజయం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో అధికార భారత రాష్ట్ర సమితి ఓటమి దిశగా పయనిస్తోంది. బిఆర్ఎస్ మంత్రులు  వెనుకంజలో ఉండగా… మంత్రి చామకూర మల్లారెడ్డి గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాల్లో గులాబీ పార్టీకి ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ మేడ్చల్ నియోజకవర్గం నుంచి మల్లారెడ్డి విజేతగా నిలిచారు. మల్లారెడ్డి దాదాపు 9 వేల ఓట్ల ఆధిక్యంతో సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. తెలంగాణ ఎన్నికల ఫలిలాల్లో కాంగ్రెస్ పార్టీ 50 స్థానాల్లో అధిక్యంలో ఉండగా, 15 స్థానాల్లో విజయం సాధించింది. అటు బిఆర్ఎస్ 35 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతుండగా, 4 స్థానాల్లో బిఆర్ఎస్ విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News