Wednesday, January 22, 2025

మంచి కంటెంట్ ఉన్న సినిమా

- Advertisement -
- Advertisement -

Malle moggalu movie

కన్నా నాగరాజు సమర్పణలో హెచ్.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్ తేజ్, వర్షిని, మౌనిక హీరోహీరోయిన్లుగా తోట వెంకట నాగేశ్వరరావు స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మల్లె మొగ్గ’. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో సినిమా ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయగా, దర్శకులు చంద్రమహేష్, నిర్మాత తోట సుబ్బారావు, దర్శక నిర్మాత దాచేపల్లి శ్రీనివాసులు చిత్ర ఆడియోని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత తోట వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ “మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. నంది అవార్డుకు ఎంపికయ్యే కథ ఇది. ఇందులో భాను చందర్ మంచి క్యారెక్టర్ చేశారు. ఇందులోని పాటలు హైలెట్‌గా నిలుస్తాయి”అని అన్నారు. హీరో అర్జున్ తేజ్ మాట్లాడుతూ “సినిమా అవుట్‌ఫుట్ చాలా బాగా వచ్చింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ కలిసి చూసే సినిమా ఇది”అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News