Thursday, January 23, 2025

‘మళ్లీ పెళ్లి’ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సీనియర్ నటుడు నరేశ్ తన వ్యక్తిగత జీవితం ఆధారంగా తీసిన సినిమా ‘మళ్లీ పెళ్లి’ మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నది. దీనికి ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించారు. కాగా చిత్ర బృందం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో నరేశ్ రెండో భార్య రమ్య రఘుపతి పాత్రలో వనితా విజయ్ కుమార్ నటించారు. సినీ నటిగా పవిత్రా లోకేశ్‌ను చూయించారు. విజయకృష్ణ మూవీస్ సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అదే పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో నటించిన ఇతర తారాగణంలో ప్రధానంగా జయసుధ, శరత్ బాబు కూడా ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News