Monday, December 23, 2024

మల్లికా మల్లికా మాలతీ మాలికా…

- Advertisement -
- Advertisement -

సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా శాకుంతలం. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోంది. గుణ టీమ్ వర్క్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ చిత్రానికి గుణశేఖర్ రచించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని ‘మల్లికా మల్లికా మాలతీ మాలికా… చూడవా చూడవా ఏడినా ఏలికా… హంసికా హంసికా జాగులే చేయక… పోయిరా పోయిరా రాజుతో రాయికా& అతనితో కానుకా ఈయనా నేనికా… వలపుకే నేడొక వేడుకే కాదా’ అంటూ సాగే పాటను శుక్రవారం విడుదల చేశారు. చైతన్యప్రసాద్ అందించిన సాహిత్యం అద్భుతంగా కుదిరింది. మణిశర్మ కూర్చిన బాణీకి అందంగా న్యాయం చేశారు సింగర్ రమ్య బెహరా. పాట వింటున్నప్పుడు ఎంత శ్రావ్యంగా అనిపించిందో, స్క్రీన్ మీద చూసినప్పుడు అంతే ఇంపుగా కనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే మల్లిక మల్లిక పాట విజువల్ ఫీస్ట్.

ఈ సందర్భంగా చిత్ర కథానాయిక సమంత మాట్లాడుతూ “శాకుంతలం సినిమా చూశాను. అత్యంత అద్భుతంగా అనిపించింది. ఆ క్షణం నుంచి వీడియో సాంగ్స్ విడుదల చేసేద్దామా అన్నంత ఆత్రుతగా ఉంది. ఆ విషయాన్నే గుణశేఖర్‌తో పంచుకున్నాను. సినిమాలో నాకు అత్యంత ఇష్టమైన పాట మల్లికా మల్లికా. ఈ పాటను వీడియోలో చూడటం చాలా ఆనందకరమైన విషయం. ప్రజలందరికీ ఇప్పుడు మల్లికా మల్లికా వీడియో సాంగ్ అందుబాటులోకి తీసుకొస్తున్నాం”అని అన్నారు. దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ ”ఈ పాట ఇష్టమని సమంత చెప్పారు. రికార్డింగ్ సమయంలో ఎంతగా ఆస్వాదించామో, ఈ పాటను తెరమీద చూసుకున్నప్పుడు అంతే సంతోషం కలిగింది. వెన్నెల, హంసలు, శ్వేతవర్ణ దుస్తుల్లో సమంత, పువ్వుల అలంకరణలు, చుట్టూ పరిసరాలు, అక్కడి ముని కన్యలు… ఈ పాట బిగ్ స్క్రీన్ మీద మరో రేంజ్‌లో అలరిస్తుందనే నమ్మకం ఉంది”అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News