Wednesday, January 22, 2025

బిజెపివి నీచ రాజకీయాలు : మల్లికార్జున ఖర్గే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ 20 సదస్సును పురస్కరించుకుని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన విందుకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించకపోవడంపై పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. రాష్ట్రపతి ముర్ము ఇచ్చే విందుకు దేశం లోని అన్ని పార్టీల నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు వెళ్లాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మాత్రం ఇప్పటివరకు ఆహ్వానం అందలేదు. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై ఖర్గే స్పందిస్తూ ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. బీజేపీ ఇలాంటి నీచ రాజకీయాలు చేయకూడదని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News