Sunday, December 22, 2024

24న కాంగ్రెస్ కీలక భేటీ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలపై ఇప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టి సారించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లకు చెందిన కాంగ్రెస్ నేతలతో ఈ నెల 24న కీలక సమావేశం ఖరారు చేశారు. ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు కొందరిని ఈ భేటీకి పిలుస్తున్నారు. కర్నాటక అంతకు ముందు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తరువాత మరికొన్ని రాష్ట్రాలు ,

ప్రత్యేకించి ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని పార్టీ నిర్ణయించుకుంది. పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఈ సమావేశంలో ఆయా ఆయా రాష్ట్రాల నాయకులకు మార్గనిర్ధేశనం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కీలక రాష్ట్రాలలో పార్టీలో అసమ్మతిని నివారించడం కలిసికట్టుగా పనిచేసే దిశలో వారిలో కదలికను తీసుకురావడం ఈ నెల 24వ తేదీ నాటి భేటీ ప్రధాన ఉద్ధేశం అని పార్టీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News