Sunday, January 19, 2025

కుమార్తె కోసం మోడీతో చేతులు కలిపారు: ఖర్గే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీలోని ఆప్ సర్కారుతో కెసిఆర్ కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. కెసిఆర్ ఆప్ తో మద్యం స్కామ్ లో పాలుపంచుకున్నారని తెలిపారు. కుమార్తె కోసం కెసిఆర్ మోడీ చేతులు కలిపారన్నారు. సనత్ నగర్ లో కాంగ్రెస్ మహిళా అభ్యర్థికి మద్దతు ఇవ్వండని ప్రజలను కోరారు. మోడీ, కెసిఆర్ ఇద్దరూ అబద్ధాలే చెబుతున్నారని మండిపడ్డారు. మోడీ, కెసిఆర్.. ఇద్దరూ ఒక్కటే.. వారు వేరువేరు కాదు అని వివరించారు. పేదల ఖాతాల్లో మోడీ 15 లక్షలు వేస్తామన్నారు.. వేశారా?, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ చెప్పారు.. ఇచ్చారా?, రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని మోడీ చెప్పారు.. చేశారా? అని ఖర్గే ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News