హైదరాబాద్: దేశంలో నిరుద్యోగితను తగ్గిస్తానన్న ప్రధాని మోడీ మాట ఏమైందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగిత మరింత పెరిగిందని ఆరోపించారు. మా పార్టీలోని నేతల మధ్యే జరుగుతున్న ఎన్నిక ఇది అని ఖర్గే పేర్కొన్నారు. బిజెపి చరిత్రలో ఇలాంటి ఎన్నిక ఎప్పూడు జరగలేదన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడిని ఎవరు నిర్దిశిస్తారో అందరికీ తెలిసిందేనని ఖర్గే ఎద్దేవా చేశారు. మోడీ పాలనలో రూపాయి విలువ రూ.82కు పడిపోయిందన్నారు. బిజెపి పాలనలో నిత్యావసరాల ధరల విపరీతంగా పెరిగాయి. గ్యాస్ సిలిండర్ దర రూ.1100 దాటిందని ఖర్గే మండిపడ్డారు. పాలు, పెరుగు, చిన్న పిల్లు వాడే పెన్సిళ్లు, రబ్బర్లపైనా జీఎస్టీ విధించారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి బరిలో ఉన్న ఖర్గే శనివారం హైదరాబాద్‌కు వచ్చిన ముచ్చట తెలిసిందే. ఆయనకు టిపిసిసి నేతలు స్వాగతం పలికారు. గాంధీభవన్‌లో పిసిసి సభ్యులతో ఖర్గే భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.