Thursday, December 26, 2024

బిసిల సెన్సస్ అత్యవసరం: ఖర్గే

- Advertisement -
- Advertisement -

కొడటరాయై (చత్తీస్‌గఢ్) : దేశంలో బిసిల జనాభా గణన జరగాలనేదే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అని పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే స్పష్టం చేశారు. సెన్సస్‌లో ఇది అత్యంత కీలక ప్రక్రియ అవుతుందన్నారు. బిసిల గణనలతో సామాజికంగా, ఆర్థికంగా వారి స్థితిగతుల గురించి నిజమైన వివరాలు తెలుస్తాయని , దీని వల్లనే వారి సంక్షేమానికి తగు చర్యలు తీసుకునే వీలేర్పడుతుందని ఖర్గే చెప్పారు.

రాయ్‌గఢ్ జిల్లాలోని కొడటరాయై గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఏర్పాటైన భరోసా కా సమ్మేళన్‌లో పాల్గొన్న ఖర్గే బుధవారం మాట్లాడారు. దేశాన్ని కులాలు, మతాలుగా వర్గాలుగా విభజిస్తూ వస్తున్న ప్రధాని మోడీ ఇప్పుడు కాంగ్రెస్‌పై నిందలకు దిగుతున్నాడని, వచ్చే ఏడాది ఎన్నికలలో ఆయన ఆటలు సాగబోవని హెచ్చరించారు. ప్రధాని మోడీ చేష్టల గురించి ప్రజలందరికి తెలిసివచ్చిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News