Tuesday, January 21, 2025

70 ఏళ్లు మేము రాజ్యాంగాన్ని రక్షించాం… మీరేం చేశారు?

- Advertisement -
- Advertisement -

 

బంకా(బీహార్): కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గత 70 ఏళ్లుగా రాజ్యాంగాన్ని పరిరక్షించిందని ఆయన చెప్పారు. గురువారం బీహార్‌లోని బంకా జిల్లాలో భారత్ జోడో యాత్రను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ, గత 70 ఏళ్లలో కాంగ్రెస్ దేశానికి ఏం చేసిందని ప్రధాని మోడీ ప్రశ్నిస్తున్నారని, దీనికి సమాధానం కాంగ్రెస్ గత 70 ఏళ్లుగా రాజ్యాంగాన్ని కాపాడుతోందని అన్నారు. ఈ కారణంగానే మోడీ ప్రధాని కాగలిగారని, తనలాంటి పేదవాడు ఎఐసిసి అధ్యక్షుడు కాగలిగాడని ఖర్గే అన్నారు.

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో బిజెపి పాత్రను ప్రస్తావిస్తూ దేశ సాతంత్య్ర పోరాటంలో బిజెపి పాత్ర ఏమీ లేదని, ఆ పార్టీకి చెందిన వారెవరూ జైలుకు వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు. దేశానికి బిజెపి స్వాతంత్య్ర తేలేదని, ఆ పార్టీ కార్యకర్తలెవరూ జైలుకు వెళ్లలేదని ఆయన అన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, దేశ అభివృద్ధికి పాటుపడింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు. మతం పేరుతో సమాజాన్ని ముక్కలు చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని, పేదవారిని అణచివేస్తోందని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News