న్యూఢిల్లీ:లోక్‌సభ లో జరిగిన భద్రతా వైఫల్యంపై పార్లమెంట్‌లో ప్రకటన ఇవ్వకుండా మౌనం వహిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా టీవీ చానళ్లకు మాత్రం ఇంటర్వ్యూలు ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ప్రశ్నలు అడిగిన ఎంపీలను అన్యాయంగా సస్పెండ్ చేయడం ఏం న్యాయమని కూడా ఆయన ప్రశ్నించారు. భద్రతా వైఫల్యంపై ప్రశ్నలు అడిగిన ప్రతిపక్ష ఎంపీలను అన్యాయం సస్పెండ్ చేశారని, ఇదేమి న్యాయమంటూ ఆయన హోం మంత్రిని నిలదీశారు. దేశ హోం మంత్రి టీవలకు ఇంటర్వూలు మాత్రం ఇస్తున్నారని, కాని పార్లమెంట్‌లో ప్రకటన మాత్రం చేయడం లేదని ఖర్గే విమర్శించారు. అమిత్ షా పార్లమెంట్‌లో ప్రకటన చేస్తే దానిపై పార్లమెంట్ ఉభయసభలలో చర్చించవచ్చని ఇండియా కూటమి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని ఖర్గే తెలిపారు. జాతీయ భద్రతకు సంబంధించిన ఈ తీవ్రమైన సమస్యపై గళం విప్పం తమ బాధ్యతని ఆయన పేర్కొన్నారు.
పార్లమెంట్ ఉభయ సభలలో అనుసరించవలసిన వ్యూహాన్ని చర్చించడానికి వివిధ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు నేటి ఉదయం సమావేశమైనట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఖర్గే తెలిపారు. కాగా, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా కాంగ్రెస్ అధ్యక్షడి అభిప్రాయంతో ఏకీభవించారు. ఈ నెల 11న లోక్‌సభలో సంభవించిన దిగ్భ్రాంతికర సంఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ప్రకటన పార్లమెంట్ ఉభయసభలలో ప్రకటన చేయాలని ఇండియా కూటమికి చెందిన ఎంపీలు డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలిపారు. భద్రతా వైఫ్యలంపై ప్రశ్నలు అడిగినందుకు సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో పలువురు ప్రతిపక్ష ఎంపీలు గురువారం సస్పెండ్ అయ్యారు. దీనికి నిరసనగా వారంతా శుక్రవారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో మౌన ప్రదర్శన నిర్వహించారు.