Saturday, November 16, 2024

తొమ్మిదేళ్ల మోడీ ప్రభుత్వం ప్రజలను దోపిడీ చేస్తుంది: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం గత వారంతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ ప్రభుత్వ లోపాలను కాంగ్రెస్ ఎండగట్టింది. ఈ తొమ్మిదేళ్లు ధరలను అదుపు చేయడానికి బదులు అహంకార పూరిత వాదనల ద్వారా భయంకరమైన ద్రవ్యోల్బణంతో ప్రజల సొమ్ము లూటీ చేసిందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. దారిద్య్రం అంచున అల్లాడి జీవిస్తున్నవారి బతుకులు ఎలాంటి బాగుకు నోచుకోకపోయినా, వచ్చే కొన్ని రోజుల్లో మంత్రులు భజంత్రీలు గా మారి ప్రధాని నరేంద్రమోడీ “గొప్ప విజయాలు” కీర్తిస్తుంటారని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రజలను దోపిడీ చేసే ప్రభుత్వంగా ధ్వజమెత్తారు. ముఖ్యమైన ప్రతిదానిపై జిఎస్‌టి ప్రభావం ఉంటోందని, బడ్జెట్ దెబ్బతీశారని, కష్టసాధ్యంగా తయారు చేశారని ఖర్గే ట్వీట్ ద్వారా విమర్శించారు.

ద్రవ్యోల్బణం కారణంగా అచ్చే దిన్ నుంచి ప్రజల సంపాదన దోపిడీ చేసే అమృత్ కాల్ దాపురించిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఈ ప్రభుత్వ “వాస్తవ విజయాలు” జాబితాలో ముఖ్యమైన వస్తువుల ధరలు పెరుగుదల ఒకటని విమర్శించారు. 2014 నుంచి వాస్తవ వేతనాల రేటు … వ్యవసాయ కార్మికులకు 0.8 శాతం, వ్యవసాయేతర కార్మికులకు 0.2 శాతం, నిర్మాణ రంగ కార్మికులకు మైనస్ 0.02 శాతం గా వివరించారు. ఈలోగా ముఖ్యమైన సరకుల ధరలు ఎల్‌పిజి 169 శాతం, పెట్రోల్ 57 శాతం, డీజిల్ 78 శాతం, ఆవనూనె 58 శాతం. గోధుమ పిండి 56 శాతం, పాలు 51 శాతం ధరలు పెరిగాయని జాబితా వివరించారు.

వాస్తవానికి గౌతమ్ అదానీ వంటి వాణిజ్య వేత్తల ఆదాయాలు తప్ప మిగతా వారి ఆదాయాలు స్తంభించాయన్నారు. 2014 నుంచి అదానీ ఆదాయం 1225 శాతం అమాంతంగా పెరిగిపోయిందన్నారు. సంఘటిత రంగం లోని వాస్తవ వేతనాలు స్తంభించాయని చూపించే వ్యాసాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వం తన వార్షికోత్సవాన్ని “మాఫియా దివాస్‌”గా గుర్తించాలని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News