Monday, December 23, 2024

మల్లికార్జున్ ఖర్గేకు జెడ్ ప్లస్ భద్రత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్టా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ జెడ్‌ప్లస్ భద్రత కల్పించింది. ఎన్నికల్లో ప్రధాన విపక్ష నేత ఖర్గే దేశమంతా విస్తృతంగా పర్యటించి ప్రచారం సాగించే అవకాశం ఉన్నందున ఎలాంటి బెదిరింపులు ఎదురు కాకుండా రక్షణ కల్పించాలని ఈనెల మొదట్లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుందని సంబంధిత అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. జెడ్‌ప్లస్ కేటగిరి భద్రత కింద 30 సిఆర్‌పిఎఫ్ కమాండోలు మూడు షిప్టుల వారీగా 24 గంటలూ రక్షణ కల్పిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News