కొత్త చీఫ్‌గా ఖర్గే.. 26న బాధ్యతల స్వీకరణ
అధ్యక్ష ఎన్నికల్లో థరూర్‌పై 6,825 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం
శుభాకాంక్షలు తెలిపిన సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ
మల్లికార్జున ఖర్గే దక్కించుకున్న ఓట్లు
శశిథరూర్‌కు పోలైన ఓట్లు1,072, చెల్లని ఓట్లు 416
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బుధవారం కౌంటింగ్ అనంతరం సెంట్రల్ అథార్టీ మధుసూదన్ మిస్త్రీ కాంగ్రెస్ కొత్త చీఫ్‌గా ఖర్గే ఎన్నికయ్యారని ప్రకటించారు. 137ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి. ఎన్నిక పోటీల్లో ఓట్లు పోలవగా 7,897 ఓట్లు దక్కించుకున్నారు. ప్రత్యర్థి శశిథరూర్‌కు ఓట్లు రాగా చెల్లనివిగా ప్రకటించారు. ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా భారీ మెజార్టీతో గెలుపొందారనిప్రకటించారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, తెలంగాణలో పోలింగ్ సరళిపై థరూర్ టీమ్ చేసిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్నామని..వారికి నేరుగా లేఖల ద్వారా సమాధానమిస్తామని మిస్త్రీ తెలిపారు. ఆ లేఖలను మీడియాకు విడుదల చేయబోమని, థరూర్ టీమ్ కాంగ్రెస్ ఎన్నికల సంఘంతో సంప్రతిస్తారని వివరించారు. కాగా తుది తీర్పు ఖర్గేకు అనుకూలంగా వచ్చిందని, తనుకూడా కొత్త అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపాను అని శశిథరూర్ ప్రకటనలో తెలియజేశారు. పార్టీ నిర్ణయమే అంతిమ నిర్ణయమని దాన్ని వినయంగా అంగీకరిస్తున్నట్లు థరూర్ పేర్కొన్నారు. పార్టీ సభ్యులే తమ అధ్యక్షుడిని ఎన్నుకోవడం కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు, పార్టీ కొలిగ్ సినియర్ నాయకుడు తాము పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తామని థరూర్ పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో 25ఏళ్లపాటు నాయకత్వం వహించిన మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పార్టీ రుణపడి ఉంటుందని థరూర్ తెలిపారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేందుకు సహకరించడంతోపాటు తటస్థంగా వ్యవహరించిన రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ వాద్రాకు థరూర్ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ సభ్యుల హృదయాల్లో నెహ్రూ గాంధీ కుటుంబానికిప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. కాగా ఏళ్ల తర్వాత వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే నెల కాంగ్రెస్ చీఫ్‌గా స్వీకరించనున్నారు.
కొత్త అధ్యక్షుడు పార్టీలో నా బాధ్యత నిర్ణయిస్తారు: రాహుల్‌గాంధీ
కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడే సుప్రీంగా బుధవారం పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు తన పాత్రను నిర్ణయిస్తారని రాహుల్ అన్నారు. పార్టీలో తను ఏ బాధ్యతలు నెరవేర్చాలో అధ్యక్షుడే నిర్ణయిస్తారని జోడో యాత్రలో రాహుల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సుప్రీం అథార్టీ పార్టీలో ప్రతి ఒక్కరు చీఫ్ ఆదేశాలను శిరసావహించాలి. భారత్ జోడో యాత్ర నివేదికను తను అధ్యక్షుడికి నివేదించనున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. తొలుత ఖర్గే తన బాధ్యత నిర్ణయిస్తారని చెప్పిన రాహుల్ అనంతరం ఎవరైతే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారో ఆయన తన పాత్రను నిర్ణయిస్తారన్నారు. ఖర్గే, థరూర్ ఎంతో అనుభవజ్ఞులు, అవగాహన ఉన్నావారు. వారికి సలహా అవసరం లేదని రాహుల్‌గాంధీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అవకతవకలు జరిగాయని శశిథరూర్ ఆరోపించారని విలేఖరులు ప్రశ్నించగా..పార్టీ తగిన నిర్ణయం తీసుకుంటుంది. కాంగ్రెస్ ఎన్నికల సంఘంలో మాజీ సిఇసి టిఎన్ శేషన్ తరహా ఉన్న మిస్త్రీ ఉన్నారు. మిస్త్రీ పారదర్శకమైన వ్యక్తి. కాంగ్రెస్ ఎన్నికల సంఘం విచారించి తగిన తీసుకుంటుందన్నారు.
ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులపై పోరాటం: ఖర్గే
కాంగ్రెస్ పార్టీలో చిన్న, పెద్ద నేతలు ఉండరని కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గే బుధవారం కార్యకర్తలంతా సంయుక్తంగా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. తను నిజమైన కాంగ్రెస్ సైనికుడిలా బలోపేతం చేసేందుకు కృషి చేస్తాను అని ఖర్గే అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఆయన విలేఖరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ సమానమే అని కలిసిప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులపై పోరాడతామనితెలిపారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కేంద్రంలో నియంత పాలన సాగుతుందని ఖర్గే ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారినవారిపై కార్యకర్తలంతా కలిసి పోరాటం చేస్తామన్నారు. కాగా ఈ నెల పార్టీ పగ్గాలు లాంఛనంగా చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్న సోనియాగాంధీ కలసి తెలిపారు. ఖర్గే నివాసంలో సోనియాగాంధీ అయ్యారు. ఖర్గే అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారనిప్రకటించిన అనంతరం చీఫ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లో ఓట్లు చెల్లవ్: అవకతవకలు జరిగాయని ఇసికి థరూర్ లేఖ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే చేతిలో శశిథరూర్ భారీ మెజార్టీతో ఓటమిపాలయ్యారు. ఈనేథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని, పోలైన ఓట్లు చెల్లనివిగా పరిగణించాలని పార్టీ ఎన్నికల సంఘానికి థరూర్ లేఖ రాశారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పోలింగ్ రోజు తెలంగాణలోనూ తీవ్రమైన సమస్యలు తలెత్తాయని థరూర్ బృందం ఇసికి లేఖ రాసింది. థరూర్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ సల్మాన్ సోజ్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఎన్నికల అథార్టీ విచారణ జరుపుతామని ఇచ్చిందని ట్వీటర్ వేదికగా తెలిపారు. కాగా సోజ్ ఇసికి రాసిన లేఖ లీక్ అవడంపై థరూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత విషయం అవడం దురదృష్టకరమని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు పార్టీ బలోపేతానికి జరిగాయని, విడదీయడానికి కాదని కేరళ ఎంపి థరూర్ వ్యాఖ్యానించారు.