Thursday, January 23, 2025

పార్లమెంట్‌లో మా గొంతు నొక్కారు.. అందుకే ఈ యాత్ర

- Advertisement -
- Advertisement -

కేంద్రంపై ఖర్గే ధ్వజం

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో సమస్యలను ప్రస్తావించడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వని కారణంగానే తమ పార్టీ భారత్ న్యాయ యాత్రను చేపడుతోందని కాంగ్రెస్ అద్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం తెలిపారు. మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ సారథ్యంలో జరగనున్న భారత్ న్యాయ యాత్ర జనవరి 14న ప్రారంభం కానున్నది. 6,713 కిలోమీమీటర్ల ఈ యాత్రలో రాహుల్ గాంధీ బస్సులో, పాదయాత్రగా సాగుతారు. ఈ యాత్ర ప్రధానంగా దేశం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలను ప్రధానంగా కేంద్రీకరిస్తుందని శనివారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో ఖర్గే తెలిపారు. ఈ యాత్రలో పాల్గొనవలసిందిగా ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులను, పౌర సమాజం సభ్యులను కూడా ఆహ్వానించినట్లు ఆయన చెప్పారు.

గతంలో దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతం వరకు కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు నిర్వహించిన భారత్ జోడో యాత్ర తరహాలోనే తూర్పు భారతం నుంచి పశ్చిమ భారతం వరకు..మణిపూర్ నుంచి ముంబై వరకు ఇప్పుడు చేపట్టనున్న భారత్ న్యాయ యాత్ర కూడా ప్రభావవంతంగా, మార్పుకు దోహదపడే విధంగా ఉంటుందని ఇదివరకు కాంగ్రెస్ తెలిపింది. ఈ యాత్ర ద్వారా ప్రజల మాటలు వింటామని ఖర్గే తెలిపారు. మరి కొద్ది నెలల్లో లోక్‌సభ న్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ యాత్ర ప్రారంభం కానున్నది. మొత్తం 66 రోజులపాటు సాగే ఈ యాత్ర 110కి పైగా జిల్లాలు, 100 లోక్‌సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను తాకనున్నది.

మణిపూర్‌లో దురదృష్టకర ఘటనలు చోటుచేసుకున్నాయని, కాని అన్ని చోట్ల ఉపన్యాసాలు, ఫోటో సెషన్లు ఇచ్చే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదని ఖర్గే విమర్శించారు. ప్రతిపక్ష నాయకులను బెదిరించి లొంగదీసుకోవడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి), సిబిఐ, ఆదాయం పన్ను శాఖలను దురినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రం ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదించిన కార్మిక చట్టాలు, క్రిమినల్ చట్టాలను ప్రస్తావిస్తూ ఇవి నియంతృత్వాన్ని సూచిస్తున్నాయని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News