Monday, December 23, 2024

సిబిఐ ప్రమాదాలను విచారించడానికి కాదు..: మోడీకి ఖర్గే ఘాటు లేఖ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత రైల్వే చరిత్రలో అత్యంత ఘోర విషాద ఘటనల్లో ఒకటైన ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘాటు లేఖ రాశారు. కేంద్ర విచారణ సంస్థ సిబిఐ కానీ, ఇతర దర్యాప్తు సంస్థలు కానీ సాంకేతిక, సంస్థాగత, రాజకీయ వైఫల్యాలపై జవాబుదారీతనాన్ని నిర్ధారించలేవని అన్నారు. నిరంతర లోపభూయిష్ట విధానాల కారణంగా రైలు ప్రయాణాల్లో అభద్రత చోటుచేసుకుని, ప్రజల ఇబ్బందులు ఇబ్బడి ముబ్బడి అవుతున్నాయని తప్పుపట్టారు. జరిగిన ప్రమాదంపై రైల్వే మంత్రి ఇప్పటికే ఒక కారణం వెతికిపట్టుకున్నారని, అయినప్పటికీ సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని ఆయన కోరుతున్నారు.

సిబిఐ అనేది నేరాలను విచారించడానికి ఉద్దేశించినదే కానీ రైల్వే ప్రమాదాలకు ఉద్దేశించినది కాదన్నారు. సాంకేతిక, సంస్థాగత, రాజకీయ వైఫల్యాలపై జవాబుదారితనాన్ని సిబిఐ కానీ, ఇతర ఏజెన్సీలు కానీ నిర్ధారించ లేవు. రైల్వేల భద్రత, సిగ్నలింగ్, మెయింటెనెన్స్ విధానాలకు సంబంధించిన సాంకేతిక నైపుణ్యాలు, శిక్షణ సిబిఐకి ఉండవు అని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News