Friday, January 24, 2025

మోడీ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న ఖర్గే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నేడు జరుగనున్న నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరుకానున్నారు. మంత్రి మండలి సభ్యులుగా కొత్తగా ఎన్నికైన ఎంపీలు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

నరేంద్ర మోడీ సాయంత్రం 7.15కు మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇదివరలో మూడు సార్లు ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ పనిచేశారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో నరేంద్ర మోడీ, ఆయన మంత్రి మండలి సభ్యలచేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనేందుకు విదేశీ నాయకులు…షెరింగ్ టొబ్గే(భూటాన్), ముహమ్మద్ ముయిజు(మాల్దీవ్స్), పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’(నేపాల్), షేఖ్ హసీనా(బంగ్లాదేశ్), అహ్మద్ అఫీఫ్(షెషల్స్), రణిల్ విక్రమసింఘే(శ్రీలంక), ప్రవింద్ కుమార్ జుగ్ నౌత్(మారిషస్) భారత్ కు వచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News