Sunday, December 22, 2024

రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణకు పోరు

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికలపై ఖర్గే

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ శుక్రవారం జరిగింది. ఓటర్లు జాగరూకతతో వోట్లు వేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పిలుపు ఇచ్చారు. ఆర్థిక సాధికారత, సమానావకాశాల నూతన శకం ఆవిర్భవించబోతున్నదని ఆయన అన్నారు. ‘మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణకు పోరాటం శుక్రవారం మొదలైంది’ అని ఖర్గే ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. భారత భవిష్యత్తును నిర్ణయించేది వోటర్లేనని ఆయన అన్నారు. మొదటి సారి వోటు వేసిన వారికి ఖర్గే అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News