Monday, December 23, 2024

మాజీ ప్రధానులు పివి, చరణ్‌సింగ్‌లకు ఖర్గే నివాళి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌లకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం నివాళులు అర్పించారు. డిసెంబర్ 23న చౌదరి చరణ్‌సింగ్ జయంతి కాగా, పివి నరసింహారావు వర్ధంతి. పివి తన పదవీ కాలంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశాన్ని ప్రగతి పథం లోకి నడిపారని ఖర్గే ప్రశంసించారు. దేశంలో అణు కార్యక్రమం లోనూ , విదేశాంగ విధానంలోనూ తూర్పు వైపు చూడు అనే విధానాన్ని తీసుకొచ్చి దేశ ప్రగతికి అభ్యున్నతికి పీవీ చెప్పుకోదగిన సేవలు అందించారని కొనియాడారు. చౌదరి చరణ్‌సింగ్ 121 జయంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. రైతు ఉద్యమ నాయకుడిగా వ్యవసాయ రంగానికి ఎనలేని సేవ చేశారని ప్రశంసించారు. రైతులే భారత దేశమని, దేశానికి అన్నదాతలని , రైతుసోదరులకు వ్యవసాయ కార్మికులకు అభినందనలు తెలుపుతున్నానని ఖర్గే తన ఎక్స్ పోస్ట్‌ల ద్వారా తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News