Sunday, January 19, 2025

దేశంలో క్షీణించిన ‘మానవ మూలధనం’ స్థాయి: ఖర్గే విమర్శ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో సామాజిక రంగానికి వెచ్చించడం బాగా తక్కువ చేసి క్రమంగా మానవ మూలధన స్థాయిని మోడీ ప్రభుత్వం క్షీణింప చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం విమర్శించారు. మోడీ ప్రభుత్వ ‘అన్యాయ కాలం’ లో విద్యకు, ఆరోగ్యభద్రతకు తక్కువగా ఖర్చుచేయడమైందని, పబ్లిసిటీకే కొన్నికోట్లు ధారపోసారని ధ్వజమెత్తారు. ఈమేరకు ఎక్స్ పోస్ట్‌లో సంబంధిన మానవ మూలధన రిపోర్టును జత చేశారు. పబ్లిసిటీకి కోట్లు ధారపోయడం వల్ల వికసిత్ భారత్ సిద్ధించిదని వ్యాఖ్యానించారు. 2024 సంవత్సరం సంక్షేమం, న్యాయం తిరిగి పొందవలసిన సంవత్సరంగా ఆయన నిర్ధారించారు. మోడీ ప్రభుత్వం బడ్జెట్‌లో సామాజిక సంక్షేమానికి కేటాయింపుల తక్కువ చేయడంపై కాంగ్రెస్ లక్షంగా పెట్టుకుని విమర్శిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News