Monday, December 23, 2024

సూర్యుడే హద్దుగా మోడీ బూటకపు వాగ్దానాలు: ఖర్గే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలోని కోటి మంది ప్రజల ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేస్తామంటూ ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం చేసిన ప్రకటనను కాంగ్రెస్ అఢ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎద్దేవా చేశారు. ప్రధాని బూటకపు వాగ్దానాలు సూర్యుడిని తాకుతున్నాయని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోడీ సోమవారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రధాని మోడీ ప్రకటనను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఎద్దేవా చేస్తూ ప్రధాని మోడీ తాజాగా ఒక కోటి ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, అయితే వాస్తవం ఏమిటంటే గత పదేళ్లుగా బిజెపి పాలనలో 10 లక్షల ఇళ్లకు కూడా రూఫ్‌టాప్ వ్యవస్థలు ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. 2022 నాటికి 40 జిడబ్లు కెపాసిటీతో రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని గతంలో మోడీ ప్రభుత్వం తప్పుడు వాగ్దానం చేసిందని ఆయన తెలిపారు.

వీటిలో 70 శాతం లక్ష్యాన్ని కూడా మోడీ ప్రభుత్వం పూర్తి చేయలేదని, పైగా 2.2 జిడబ్లు కెపాసిటీగల సోలార్ వ్యవస్థలను మాత్రమే ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. ఏర్పాటు చేసిన సామర్ధంలో కేవలం ఐదింట ఒక వంతు మాత్రమే విద్యుత్ ఉత్పాదకత జరుగుతోందని ఆయన చెప్పారు. ఎటువంటి నిధుల కేటాయింపు జరపకుండా మోడీ ప్రభుత్వం తన లక్ష్యాన్ని 2026కి మార్చిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సీజన్ వచ్చిందంటే బూటకపు వాగ్దానాల సీజన్ మొదలవుతుందని ప్రధాని మోడీని ఉద్దేశించి ఖర్గే ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News