Monday, December 23, 2024

తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు దేశానికి ఒక మెసెజ్: ఖర్గే

- Advertisement -
- Advertisement -

కేసీఆర్ పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదని.. కేసీఆర్ ప్రభుత్వం పేదల వ్యతిరేకి సర్కార్ అని ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అలంపూర్ లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు మల్లిఖార్జున్ ఖర్గే ముఖ్య అథితిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రజలని కలువని ముఖ్యమంత్రి మనకెందుకు?. కాంగ్రెస్ గెలవకుండా మోదీ కుట్ర చేస్తున్నారు. మోదీ, కేసీఆర్ ఇద్దరు ఒక్కటే. మా పార్టీకి సంబంధించిన రూ.780 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. కాంగ్రెస్ భయపడే పార్టీ కాదు.. పోరాడే పార్టీ. బ్రిటీష్ వాళ్లకే భయపడలేదు.. బీజేపీ వాళ్లకు భయపడతామా?. ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు దేశానికి ఒక మెసెజ్” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News