మోడీ పాలనలో ఉద్యోగాలు లేవు.. అచ్చే దిన్ నయ్.. దేశంలో ధరలు మండిపోతున్నాయని.. ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే తీవ్రస్థాయిలో విమర్శించారు.
గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ లెవల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సంద్భంగా మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి బూత్ లెవల్ కార్యకర్తలే బలమని.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ నాయకులు, కార్యర్తల కృషితోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ బాగా పనిచేస్తుచేస్తోందని.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను రేవంత్ సర్కార్.. 100 రోజుల్లో నెరవేరుస్తుందని చెప్పారు.
మోదీ సర్కార్ ప్రకటనలు తప్ప.. పనులు మాత్రం జరగడం లేదన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోడీ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. నల్లధనంపై ఇచ్చిన హామీని మోడీ మర్చిపోయారని విమర్శించారు. బిజెపియేతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టేందుకు మోడీ, అమిత్ షాలు కుట్రలు చేస్తున్నారని ఖర్గే అన్నారు.