- Advertisement -
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి మేఘ్వాల్, నారీశక్తి వందన్ పేరుతో మంగళవారం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లీఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. “2010లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. వెనకబడిన వర్గాల మహిళలకు కూడా అవకాశాలు దక్కాలి. అన్ని పార్టీలు మహిళలను చిన్నచూపు చూస్తున్నాయి. ప్రశ్నించలేని మహిళలకు అవకాశం ఇచ్చారు” అని అన్నారు. దీంతో మహిళా నేతలను కించపరిచే విధంగా మల్లీఖార్జున ఖర్గే మాట్లాడుతున్నారని ఆయన ప్రసంగాన్ని బిజెపి నేతలు అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఖర్గే ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు.
- Advertisement -