Saturday, April 26, 2025

అధికారంలోకి వస్తే 25 గ్యారంటీలను అమలు చేస్తాం: ఖర్గే

- Advertisement -
- Advertisement -

తమ పార్టీ అధికారంలోకి వస్తే 25 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. శనివారం జైపూర్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ  గ్యారంటీలను అమలు చేస్తామని తాము హామి ఇచ్చామని.. ప్రధాని మోడీలా తాము అబద్దాలు చెప్పడం లేదన్నారు. మోడీ అనేక గ్యారంటీలను ప్రకటించారని, ఇప్పటివరకు ఆయన ఏ గ్యారంటీని పూర్తిగా అమలు చేశారని మిమ్మల్నీ అడగాలనుకుంటానన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ.. గత 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని.. మరి, 20 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా? లేదా? అని  ప్రజలనుద్దేశించి ఖర్గే అడిగారు.

బెదరింపులతో ప్రతిపక్ష నేతలు బిజెపిలో చేరుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ అన్నారు. నేడు మన దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని..మన రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆమె చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News