Saturday, December 21, 2024

ప్రతి ఒక్కరిపై రూ.లక్షన్నర అప్పు పెట్టారు: మల్లిఖార్జున ఖర్గే

- Advertisement -
- Advertisement -

తొమ్మిది ఏళ్ల పాలనలో కెసిఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. ఆదివారం సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్నడినప్పుడు మిగులు రాష్ట్రంగా ఉండగా.. కెసిఆర్, రూ.5 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రతి ఒక్కరిపై రూ.లక్షన్నర అప్పు పెట్టారని ఆరోపించారు. మోడీ పాలనలో కార్పొరేట్లు మాత్రమే బాగుపడుతున్నారని… ఈ తొమ్మిది ఏళ్లలో అదానీ ఆదాయం మాత్రమే రెట్టింపు అయ్యిందని ఖర్గే విమర్శించారు.

హైదరాబాద్ లో నెహ్రూ, ఇందిరాగాంధీ ఎన్నో జాతీయ సంస్థలను నెలకొల్పారని.. కాంగ్రెస్ స్థాపించిన సంస్థలతో ఎన్నో ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నో హామీలను నెరవేర్చిందన్పారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇచ్చే ఆరు హామీలను నెరవేరుస్తుందని చెప్పారు. రైతు భరోసా కింద రైతులకు ఎకరానికి రూ.15వేలు ఇస్తామని.. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని తెలిపారు. మహిళలకు ప్రతినెల ఖాతాల్లో రూ.2500 వేస్తామని చెప్పారు. వరికి మద్దతు ధరతోపాటు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని.. విద్యార్థులకు యువవికాసం కింద చదువులు కోసం రూ.5 లక్షలు ఇస్తామని ఖర్గే పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News